మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ తన తాజా చిత్రం ఆవేశం విజయంతో దూసుకుపోతున్నాడు. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు వసూలు చేసి ఫహద్ ఫాసిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. నటుడు ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.
E4 ఎంటర్టైన్మెంట్ నిర్మించే ఈ చిత్రం కోసం ఫహద్ ఫాసిల్ దృశ్యం ఫ్రాంచైజీ దర్శకుడు జీతూ జోసెఫ్తో చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి శాంతి మాయాదేవి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.