హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి చిత్రం మిస్టర్ బచ్చన్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. రవితేజ నటిస్తున్న ఈ చిత్రం అజయ్ దేవగన్ సూపర్‌హిట్ చిత్రం రైడ్‌కి అధికారిక రీమేక్. అజయ్ దేవగన్ రైడ్‌కి సీక్వెల్‌ను ప్రకటించాడు. దీనికి రైడ్ 2 అని పేరు పెట్టారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని అజయ్ దేవగన్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వాని కపూర్, రితేష్ దేశముఖ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం 15 నవంబర్ 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రాబోతోంది. రైడ్ 2 ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలో చిత్రీకరించబడుతుంది. భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa