ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'గొర్రె పురాణం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 03:52 PM

టాలీవుడ్ నటుడు సుహాస్ ఇటీవల బాబీ దర్శకత్వంలో నటించిన తన చివరి చిత్రం 'గొర్రె పురాణం' బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 10, 2024న ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఆసక్తికరమైన ట్విస్ట్‌లో, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలోని మేక పాత్రకు తన గాత్రాన్ని అందించాడు. గొర్రె పురాణం చిత్రానికి  పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఫోకల్ వెంచర్స్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa