తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, ఇటీవల విజయవంతంగా భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. దీపావళి సందర్భంగా చెన్నైలోని తన నివాసం ఎదుట రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారని, అందుకు అతడిని అభినందిస్తున్నానని తెలిపారు. బీజేపీ, డీఎంకే పార్టీలను తమ ప్రత్యర్థులుగా విజయ్ ప్రకటించారు.