గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్న (మార్చి 27) పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ టీమ్ చేపట్టిన సామాజిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్ టీమ్ తెలంగాణ, ఏపీ, ఒడిశా, బెంగళూరులో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. అభిమానులు బారీగా తరలి వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. మొత్తం 1,140 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ రక్తాన్ని... వివిధ రకాలుగా రక్తం అవసరం ఉన్న 3,420 మంది వ్యక్తులకు అందించనున్నారు.
![]() |
![]() |