ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బుల్లెట్ బండి' తెలుగు టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 05:47 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ - నటుడు - దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బులెట్ బండి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన లభించింది. లారెన్స్ సోదరుడు ఎల్విన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ టీజర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో వైశాలి రాజ్ మరియు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పికి చెందిన కతిరేసన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa