డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్
 

by Suryaa Desk | Thu, Apr 25, 2024, 07:39 PM

ఏపీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి ఇంట్లో ఎన్నికల చిచ్చు రేగింది. ముత్యాల నాయుడి ఇద్దరు భార్యల పిల్లలు ఇప్పుడు ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారు. బూడి మొదటి భార్య కుమారుడు రవి, రెండో భార్య కుమార్తె అనూరాధ ఇక్కడ పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అనకాపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. దీంతో 2019లో తాను గెలిచిన మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన.. తన రెండో భార్య కుమార్తె అనూరాధకు టికెట్‌ ఇప్పించుకున్నారు. ప్రస్తుతం కె కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అనూరాధ నామినేషన్‌ కూడా వేశారు. ఇంతలో మొదటి భార్య కుమారుడు రవి తెరపైకి వచ్చారు.. ముత్యాలనాయుడి వారసుడినైన తనకు టికెట్‌ ఇవ్వకుండా అనూరాధకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ.. మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.


గతంలో తాను జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నానన్నారు రవి. ఇప్పుడు సమయం వచ్చిందని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నాయకులు పథకాల ఆశ చూపుతారని, ఓటర్లు మోసపోవద్దని ఆయన సూచించారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఏం కావాలో అది చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానన్నారు. మాడుగుల అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారులపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

Latest News
Artemis II mission: NASA targets February 6 to return humans to the Moon Mon, Jan 19, 2026, 01:27 PM
'Is this Sri Lanka?' Janardhana Reddy asks Siddaramaiah after attack on his residence Mon, Jan 19, 2026, 01:23 PM
Dalit youths protest after being denied permission to lift palanquin of Goddess in Karnataka Mon, Jan 19, 2026, 01:22 PM
Kerala Assembly polls: Chennithala accuses CPI(M) of communal polarisation bid Mon, Jan 19, 2026, 12:58 PM
Kohli is tied to the job of scoring runs, not to an image: Gavaskar Mon, Jan 19, 2026, 12:53 PM