|
|
by Suryaa Desk | Fri, Apr 26, 2024, 03:12 PM
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న (గురువారం) ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జీ షీట్‌లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిలా చెప్పారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివేక హత్య కేసు విచారణ జరగకుండా సీబీఐ అధికారులను బెదరిస్తున్నారని, సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముద్దాయికి ఎంపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. వివేక హత్య కేసు విచారణను ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా ఆధారాలు ఇంకా ఎం కావాలని కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. ఎవరి పాత్రను కప్పిపుచ్చడం కొరకు ముద్దాయిలను జగన్ కాపాడుతున్నారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి వివేక కేసులో నిందితుడని.. ఆయనను కాపాడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. వివేక సతీమణి సౌభాగ్యమ్మ జగన్‌కు లేఖ రాశారని, ఆయినా జగన్ మనసు కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ నైతిక బాధ్యత వహించి సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. లేదా వివేకను హత్య చేసిన వారిని, కుట్రదారులను శిక్షించాలని కనకమెడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
Latest News