|
|
by Suryaa Desk | Fri, Apr 26, 2024, 03:16 PM
విజయవాడ నగరంలోని వన్ టౌన్ 55వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనాను కలిసి మహిళలు తమ సమస్యలను ఏకరుపెట్టారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ, సమస్యలు పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకుని చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. ముస్లింకు రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముస్లింలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొన్ని పార్టీలు ఓటమి భయంతో ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారన్న సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News