|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 04:32 PM
అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారని మంత్రి బొత్స అన్నారు.
Latest News