|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 04:33 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. సీఎం వైయస్ జగన్ ఈ నెల 28 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తాడిపత్రి లో వైయస్ఆర్ సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి లో త్రిభువని సర్కిల్ లో జరిగే సభ లో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ని కందుకూరులో కె ఎం సి సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
Latest News