మేనిఫెస్టోల హడావిడి
 

by Suryaa Desk | Sat, Apr 27, 2024, 05:03 PM

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోలను విడుదలచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ సైతం పూర్తిస్థాయి మేనిఫెస్టోను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో టీడీపీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలను ఈ మేనిఫెస్టో ఆకర్షించడంతో పాటు.. ఎవరితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపించడంతో ఎంతో పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండటంతో రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వైసీపీతో పోల్చినప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో అంశాలు అమలయ్యే అవకాశం ఉందనే విశ్వాసం ప్రజల్లో కలుగే అవకాశం ఉంది.

Latest News
OPS flays DMK over 'brutal assault' on migrant Odisha worker in TN's Tiruttani Wed, Dec 31, 2025, 02:29 PM
Three die of suffocation in Bihar Wed, Dec 31, 2025, 02:24 PM
IMD confirms northeast monsoon deficit as TN records below normal rainfall this season Wed, Dec 31, 2025, 02:11 PM
Over 2,000 Afghan refugees deported from Iran, Pakistan in single day Wed, Dec 31, 2025, 01:58 PM
Bus row intensifies between Kerala Minister and Thiruvananthapuram Mayor Wed, Dec 31, 2025, 01:56 PM