సీఎం జగన్ కి లేఖవ్రాసిన షర్మిల
 

by Suryaa Desk | Sat, Apr 27, 2024, 05:04 PM

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంచలన లేఖ రాశారు. ఇదీ నీ పాలన అంటూ జగన్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. శనివారం నాడు ఈ మేరకు ఆమె లేఖ రాశారు. మరి ఆ లేఖలో ‘ఘనత వహించిన మీ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల బతుకులు దయనీయంగా మారాయి. జీవన ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి మీ పాలనలో ఎదురవుతోంది. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా 'ఉప ప్రణాళిక'ని మంట గలిపారు. మీరొచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలు, కార్యక్రమాలను నిర్దయగా, నిర్లక్ష్యంగా నిలిపివేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా.. దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. వాటిని నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. ప్రధానంగా వారికి రక్షణ లేదు. పైగా, ఇలా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లు, మోతుబర్లు, రౌడీ మూకలే! ఉన్నారు.’ అంటూ జగన్ పాలనా తీరుపై షర్మిల ధ్వజమెత్తారు.

Latest News
Cold conditions prevail in Rajasthan; light rain forecast for today Wed, Dec 31, 2025, 10:47 AM
5th T20I: Harmanpreet's 68 and late blitz from Arundhati help India post 175/7 Wed, Dec 31, 2025, 10:40 AM
Rs 3 crore crypto fraud: ED raids 9 properties in Chandigarh, Haryana; freezes accounts Tue, Dec 30, 2025, 05:02 PM
CM Nitish Kumar inspects Dr APJ Abdul Kalam Science City in Patna Tue, Dec 30, 2025, 04:45 PM
Private equity investments in Indian real estate up 59 pc to $6.7 billion in 2025 Tue, Dec 30, 2025, 04:41 PM