అమ్మఒడి రూ.15 వేలను రూ.17 వేలకు పెంపుచేస్తాం
 

by Suryaa Desk | Sat, Apr 27, 2024, 05:09 PM

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడిస్తున్న అమ్మ ఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తు్న్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ సాయం తల్లులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. పిల్లల చదువులు భారం కాకూడదనే సాయం పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమన్న జగన్.. ఇచ్చిన హామీలన్నీ తూ.చా. తప్పకుండా అమలు చేశామన్నారు. మా పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందని.. నవరత్నాల కింద ఇప్పటివరకు రూ.2 లక్షల 70వేల కోట్లను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.2019లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలోనే హామీలన్ని నెరవేర్చి చూపామన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు.

Latest News
With Khaleda Zia gone, BNP’s surge threatens ISI’s Jamaat-centric strategy Tue, Dec 30, 2025, 02:30 PM
Khaleda Zia's complex legacy and turbulent ties with India Tue, Dec 30, 2025, 02:20 PM
Govt releases white paper on democratising access to AI infrastructure Tue, Dec 30, 2025, 02:02 PM
From labour laws to market reforms, India's growth story built on credibility and stability: PM Modi Tue, Dec 30, 2025, 02:01 PM
Amit Shah assures voting rights for Matuas who have submitted applications for citizenship under CAA Tue, Dec 30, 2025, 01:48 PM