|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:36 PM
ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ పాలనపై తనకు అపారమైన అనుభవం, అవగాహన వున్నాయని... ప్రజలు అవకాశమిస్తే వాటిని ఉపయోగించి నియోజకవర్గ అభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం ద్వారా వారి రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్.ప్రతిపక్షంలో వుండగానే ఎంపీగా నియోజకవర్గానికి విలువైన సేవలు అందించిన తాను ఈ పర్యాయం గెలిస్తే కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వాల అండతో తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు మాట ఇస్తున్నారాయన. తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి గురించి తన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
Latest News