|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:40 PM
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదం లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. సీతంపేట మండలంలోని దేవనాపురం, వేంపల గూడ, రేగులగూడ, పాత ఈతమానుగూడ, కొత్తగూడ, ఇప్పగూడ, ముకుందాపురం, కల్లంగూడ, ఆనపకాయలగూడ, పులిపుట్టి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి, గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు సవరతోట ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.
Latest News