|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:50 AM
దేశ భవిష్యత్తు, రాష్ట్రం అభివృద్ధి యువ ఓటర్ల భుజస్కంధాలపై ఉందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఎప్పుడూ యువ ఓటర్లను ప్రోత్సహిస్తుందని చెప్పారు. పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరులో శనివారం నిర్వహించిన ఓటర్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Latest News