పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. 10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు.. నెలకు ఎంత కట్టాలంటే
 

by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:37 PM

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను పొదుపు మార్గం వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వ పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో చాలా వరకు పోస్టాఫీసు ద్వారానే అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం భరోసా ఉన్న నేపథ్యంలో చాలా మంది తమ డబ్బులను డిపాజిట్ చేసేందుకు పోస్టాఫీసుల వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు సైతం అధిక మొత్తంలోనే ఉన్నాయి. మీరు నెల నెల చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకుంటే పోస్టాఫీసు అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ఇందులో 10 ఏళ్లలోనే చేతికి రూ.17 లక్షలు ఏ విధంగా వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో నెల నెలా పొదుపు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు లేదా 60 నెలలు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ రేటును 6.7 శాతంగా అందిస్తోంది కేంద్ర సర్కార్. 2024, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ ఈ వడ్డీ రేటును నిర్ణయించింది. అలాగే ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎలాంటి లిమిట్ లేదు. మీరు నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు రోజుకు కేవలం రూ.33 మాత్రమే పడుతుంది. 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి సొమ్ము రూ.70 వేల వరకు అవుతుంది. మరో ఐదేళ్లు పొడిగించి 10 ఏళ్ల తర్వాత తీసుకుంటే చేతికి రూ.1.70 లక్షల వరకు వస్తాయి.


10 ఏళ్లలో రూ.17 లక్షలు ఎలా?


మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేయాలి. అంటే నెలకు మీ పెట్టుబడి రూ.10 వేలు అవుతుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టర్మ్ 5 ఏళ్లు కాబట్టి ఈ సమయానికి మీ కార్పస్ రూ.7.13 లక్షలు అవుతుంది. అయితే, మీరు ఈ స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించుకున్నారు అనుకుందాం. అప్పుడు 10 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు, దానిపైన వడ్డీ రూ.5,08,546 అవుతుంది. అంటే మొత్తంగా 10 ఏళ్ల తర్వాత మీ చేతికి అసలు, వడ్డీ కలిపి రూ.17,08,546 అవుతుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ కల్పిస్తోంది. ఇది ఇటీవలి కాలంలో చూసుకుంటే గరిష్ఠ రేటుగా చెప్పవచ్చు. ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి మంచి లాభం అందుతుందని చెప్పవచ్చు.

Latest News
Nitish Kumar govt announces implementation of 'Saat Nishchay - 3' in Bihar Tue, Dec 16, 2025, 01:52 PM
India's paints industry set to touch $16.5 billion by 2030 Tue, Dec 16, 2025, 01:09 PM
Crown Prince Al Hussein Bin Abdullah II drives PM Modi to Jordan Museum Tue, Dec 16, 2025, 01:07 PM
ADB cuts growth forecast of Bangladesh to 4.7 pc amid weak exports, investments Tue, Dec 16, 2025, 01:06 PM
Virat Kohli visits Premanand Ji Maharaj's ashram with wife Anushka Sharma Tue, Dec 16, 2025, 01:05 PM