|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:00 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్‌లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి అల్లూరులో చంద్రబాబు బసచేస్తారు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం 3.30 గంటలకు పట్టణంలోని వెంకటనాయునిపల్లె రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి వాహనంలో వచ్చి గాంధీ సర్కిల్‌లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.10 గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పటేల్ సెంటర్‌కు రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. 7.50 గంటలకు మాండ్ర శివానందరెడ్డి నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.
Latest News