|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:05 PM
రానున్న ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయమని, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని శివనందినగర్, పెండేకంటి నగర్‌లలో బసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఇంటింటి ప్రచా రం చేశారు. బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ప్రజలకు మరో 15రోజుల్లో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌ను, ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధ్దంగా ఉన్నారన్నారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనలో రాష్టం అన్ని విధాలా నాశనం అయింద న్నారు. ఎస్సీ, ఎస్టీకి చెందిన 28 పథకాలు, బీసీలకు చెందిన 30 పథకాలు, మైనార్టీలకు చెందిన 11 పథకాలు రద్దు చేశారని అన్నారు. 5 ఏళ్లలో మేనిఫెస్టోలో 30 శాతం హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని వంచించిన వైసీపీని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయడం ఖాయమని బీసీ అన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను కాటసాని చంద్రశేఖర్‌రెడ్డితో కలసి వివరించారు. బురానుద్దీన్, కాశీంబాబు, రాయల సీమ సలాం, కలాం, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, అధిక సంఖ్యలో బనగానపల్లె పట్టణ టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News