|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:07 PM
రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్ కోసం అండగా నిలబడి కూటమి గెలుపు కోసం పవన్‌కల్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారు అని ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ అన్నారు. ఆమె మాట్లాడుతూ... నా భర్త రాజా మరణం అనంతరం అండగా నిలిచి ధైర్యం చెప్పిన చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది. కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి నాకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారెడ్డిసాగర్, చంద్రబాబు సాగర్ ఆధునికీకరణ పనులు జరగక రైతులకు నీరు అందడం లేదు. అధికారంలోకి రాగానే సమస్యల్నీ పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.
Latest News