|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:11 PM
వైసీపీ మోస పూరిత మాటలు నమ్మి దగాపడ్డ అన్ని వర్గాల ప్రజలు ఎన్డీయే కూటమికి మద్దతు పలుకుతున్నారని వచ్చే ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయానికి సహకరిస్తున్నారని అనపర్తి నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్ధ్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తి మండలం రామవరంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బుంగ సంజయ్ జిల్లా నాయకులతో కలిసి నల్లమిల్లికి మద్దతు ప్రకటించారు. సంజయ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులకు తీరని అన్యాయం చేసిందన్నారు. తమకు అందాల్సిన నిధులను దారి మళ్లించడమే కాకుండా 27 పథకాలను రద్దు చేసి తీరని అన్యాయం చేసిందన్నారు. వచ్చే ఎన్నికలలో దళితులంతా ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేస్తావ న్నారు.
Latest News