|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:21 PM
తమ కుటుంబంలో జరిగిన ఘటనలకు కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త... బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. న్యాయం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో జరిగిన మతప్రార్థనల్లో ఆయన పాల్గొని, బోధనలు చేశారు. పాపులను తొక్కిపడేయాలంటే ధైర్యంగా నిలబడాలని, పాపులను విశ్వసించవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎవరూ భయపడొద్దని, పాపాలు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారని సమాచారం. వీలైతే రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
Latest News