కూటమికి విశేష ఆదరణ లభిస్తుంది
 

by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:26 PM

అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి విజయం కోసం అటు నేతలు ఇటు కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగంపేట మండలంలో దొడ్డిగుంట, వెంకటాపురం, ఈలకొలను గ్రామాల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించగా అనపర్తిలోని బాపనమ్మగుడి ఏరియా, శివాలయం వీధి, పాత హరిజనపేట ప్రాంతాల్లో నల్లమిల్లి సతీమణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదే విధంగా బిక్కవోలులో నల్లమిల్లి తనయుడు మనోజ్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో నల్లమిల్లి తనయ డాక్టర్‌ సనాతని ఇంటింటా ప్రచారం నిర్వహించి కమలం గుర్తుపై అటు ఎంపీ అభ్యర్ధి అభ్యర్ధి పురందేశ్వరిని, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని వైసీపీ ప్రభుత్వ ధోరణికి ప్రజలు విసుగుచెందారని ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Latest News
'Desperate attempt, won't affect Mahayuti': BJP mocks Thackeray brothers' alliance Wed, Dec 24, 2025, 02:39 PM
Health quizzes held in Gujarat's Sabarkantha to create awareness among adolescents Wed, Dec 24, 2025, 02:30 PM
BP sells 65 pc stake in Castrol for $6 billion Wed, Dec 24, 2025, 02:29 PM
Virat Kohli completes 16,000 List A runs on Vijay Hazare Trophy return Wed, Dec 24, 2025, 02:28 PM
Awami League raises alarm over surge in custodial deaths under Yunus-led interim govt in Bangladesh Wed, Dec 24, 2025, 02:07 PM