|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:28 PM
‘బటన్ నొక్కాను.. బటన్ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్ వార్ అంటున్నాడు.. ఏది క్లాస్ వార్..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు. రూ.వంద బాదేశాడు.. రూ.వెయ్యి నొక్కేశాడు.. తాడేపల్లి ప్యాలె్‌సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది.. క్లాస్ వార్ అంటే అదీ..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలని.. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్టని ధ్వజమెత్తారు. 99.5 శాతం అమలు చేశామంటూ ప్రజలను మోసగిస్తున్నాడని.. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలనూ దగా చేసిన వైసీపీని మే 13న ఓటుతో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.ప్రజాగళంలో భాగం గా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్ 99.5ు హామీలు అమలు చేశానని చెబుతున్నాడని.. మద్య నిషేధం చేశాడా? జాబ్ కేలెండర్ ఇచ్చాడా? ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించా రు. చివరకు చెత్తపై కూడా పన్నులు వేసిన చెత్త ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు.
Latest News