|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:33 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి.గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.
Latest News