|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:36 PM
సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా అన్నారు. సోమవారం పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ విడుదల చేసిన 2024 మేనిఫెస్టో చాలా బాగుందన్నారు. అన్ని వర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పారు. మేనిఫెస్టోలో అవ్వ తాతలకు రూ.3,500 పెన్షన్, విద్య వైద్య రంగానికి పెద్దపీట, మహిళలకు ఆసరా, సున్నా వడ్డీ పథకాలు , అన్నదాతకు రైతు భరోసా పెంపు అద్భుతంగా ఉందన్నారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు పరిచిన ఏకైక నాయకుడు జగనన్న అని తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి సుధా, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని ప్రజలను కోరారు
Latest News