by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:32 PM
కన్నతల్లే పది నెలల పసికందును గొంతు నులిమి చంపేసిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్ట గ్రామంలో జరిగింది. తల్లికి మతి స్థిమితం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దేవరబెట్ట గ్రామానికి చెందిన హనుమంతమ్మకు పది నెలల క్రితం కుమారుడు జన్మించాడు. పసికందుకి విశ్వనాథ్ అని పేరు పెట్టారు. ఆ తరువాత హనుమంతమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఇక తాజాగా ఆమె తన కుమారుడిని గొంతు నులిమి చంపేసింది. ఆపై గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. స్థానికులు దీనిని గమనించి అడ్డుకున్నారు. తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News