5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్
 

by Suryaa Desk | Fri, Jun 28, 2024, 09:58 PM

భూ కుంభకోణంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తీ మోర్చా - జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు శుక్రవారం బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ నిర్ణయంతో జేఎంఎం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే హేమంత్ సోరెన్ బయటికి రాగానే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తోందని మండిపడ్డారు.


జార్ఖంగ్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి బిర్సా ముండా జైలుకు వెళ్లిన హేమంత్‌ సోరెన్‌కు బెయిల్ రావడంతో శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్‌కు స్వాగతం పలికేందుకు జేఎంఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున బిర్సా ముండా జైలు వద్దకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మద్దతు తెలిపిన వారికి, న్యాయవ్యవస్థకు హేమంత్‌ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ ధన్యవాదాలు తెలిపారు.


భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31 వ తేదీన హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం బిర్సా ముండా జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న హేమంత్ సోరెన్.. తాజాగా బయటికి వచ్చారు. అయితే అరెస్ట్ సమయంలో జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్.. అరెస్ట్‌కు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంపై సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ కొనసాగుతున్నారు.

Latest News
BCCI gifts special 'NAMO' India jersey to PM Modi Thu, Jul 04, 2024, 04:46 PM
Hathras stampede: 6 'Satsang' organisers held; Rs 1 lakh bounty on main accused Thu, Jul 04, 2024, 04:45 PM
SCO leaders underscore multipolarity, oppose unilateral sanctions Thu, Jul 04, 2024, 04:43 PM
Dept was with RJD for 18 months: Bihar minister shifts blame on Tejashwi for bridge collapse Thu, Jul 04, 2024, 04:43 PM
Ex-J&K Minister rejoins Mehbooba Mufti's PDP Thu, Jul 04, 2024, 04:25 PM