by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:01 PM
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని కొత్తపల్లి నుంచి తువ్వపాడు వెళ్లే రహదారికి ఇరువైపులా చిల్లచెట్లు పెరగడంతో దారి మూసుకుపోయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి ఉండడంతో ఎదురుగా వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని శనివారం వాహనదారులు వాపోయారు. రాత్రిపూట మూల మలుపులు తెలియక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరారు
Latest News