by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:47 PM
కారాగార సంస్కరణలు, చట్టపరమైన హక్కులు, కౌన్సిలింగ్, వయోజన విద్య మొదలైన సేవల్లో పేరుపొంది, సామాజిక సేవలతో కలిసి పనిచేసే సిబ్బంది ఎంపికకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అనుభవం ఉన్నవారు తమ విద్యార్హతలతో జులై ఐదు లోపు కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Latest News