అభివృద్ధిలో పోటీ పడండి, గుండాగిరిలో ఐతే మేము పోటీ పడలేము
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:38 PM

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా? అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అయన మీడియాతో మాట్లాడుతూ..... మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేశామా?. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్‌లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మార్చి వేశారు ఇది నిజం కాదా?. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ-9 ప్రసారాలు నిలిపి వేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశాం. పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం?. పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీ పడండి. గుండాగిరిలో మీతో మేము పోటీ పడలేము. నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయటం దారుణం. మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మీలకు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.    

Latest News
BJP leads in Haryana, say early trends Tue, Oct 08, 2024, 09:59 AM
Celebrations at Cong HQ as trends trickle in Haryana, J&K Tue, Oct 08, 2024, 09:51 AM
Mohsin Naqvi confident' of India's participation in Pakistan's Champions Trophy 2025 Mon, Oct 07, 2024, 04:58 PM
ADB approves US$125 million loan, grant to boost irrigation in Nepal Mon, Oct 07, 2024, 04:56 PM
Gambhir's advice was to focus on strengths and abilities: Mayank Yadav on his T20I debut Mon, Oct 07, 2024, 04:55 PM