by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:04 PM
పీలేరు టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సామాజిక పింఛన్ల పంపిణీనీ ప్రారంభించారు. కలికిరి మండలం, పత్తేగడ పంచాయతీ, తన స్వగ్రామం నగిరిపల్లెలో సోమవారం ఉదయం పింఛన్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 వేల పింఛన్ ను 4 వేలకు పెంచారని కొనియాడారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో పింఛను 7 వేలు ఇవ్వడం లబ్ధిదారులలో ఆనందం నింపిందని తెలిపారు.
Latest News