by Suryaa Desk | Mon, Jul 01, 2024, 04:14 PM
హిందువులు అని చెప్పుకునే కొందరు హింసకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ హింసకు మతాన్ని ముడిపెట్టడం సరికాదన్నారు. దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ మతం ఆధారంగా ఎవరిపైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేయరాదని, రాహుల్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.
Latest News