by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:46 PM
చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం పాపాయిపాలెంలో జరిగిన దేవర కొలుపుల్లో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరువాత రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ చీరాల శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమం లో క్లబ్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం గాంధీనగర్ పంచా యతీ హౌసింగ్ కాలనీలో కల్యాణ మండపంలో కాలనీ వాసులు కొండయ్యకు ఆత్మీయ సన్మానం చేశారు. వారికి అండగా ఉంటానని కొండయ్య ఆ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. రాత్రికి బుర్లవారిపాలెంలో జరిగిన దేవర కొలుపుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండయ్య ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమా ల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News