జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా.. భక్తులు ఈ వివరాలు తెలుసుకోండి
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 09:27 PM

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. శ్రీవారి జులై నెల విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జులై 2న మాతత్రయ ఏకాదశి, జులై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం, జులై 15న పెరియాళ్వార్ సత్తుమొర, జులై 16న ఆణివార ఆస్థానం, పుష్ప పల్లకి, జులై 17న తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాసవ్రతం ప్రారంభం, జులై 21న గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, జులై 30న ఆది కృత్తికా, జులై 31న సర్వ ఏకాదశి ఉత్సవాలను నిర్వహిస్తారు.


తిరుమల తిరుపతి దేవస్థానములు అనుబంధ ఆలయాల్లో జులై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. జులై 4 నుంచి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జులై 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు. జులై 16 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం. ⁠జులై 17 నుంచి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. జులై 18 నుంచి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు.


జులై 18 నుంచి 22వ తేదీ వరకు శ్రీ విఖనశాచార్య ఉత్సవములు.. జులై 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ నిర్వహిస్తారు. జులై 26న శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం.⁠ జులై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం. జులై 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆడి కృతిక.. ⁠జులై 31న సర్వ ఏకాదశి నిర్వహిస్తారు.


తిరుచానూరు శ్రీ సుందర రాజ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు.


సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చ‌కులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఏవీఎస్వో సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News
Three dead due to rain-related disasters in Sri Lanka Mon, Oct 14, 2024, 01:49 PM
'Go to HC': SC refuses to entertain plea challenging J&K LG's power to nominate 5 members to Assembly Mon, Oct 14, 2024, 01:41 PM
Shashi Tharoor welcomes 'ton-up Sanju' after maiden T20I century Mon, Oct 14, 2024, 01:26 PM
Dalit man's death in police custody: Ajay meets family members, demands Rs 1 crore compensation Mon, Oct 14, 2024, 01:22 PM
Women's T20 WC: Manjrekar hails Harmanpreet's gritty inning in India's narrow loss to Australia Mon, Oct 14, 2024, 01:03 PM