ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ దుకాణం.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 10:35 PM

విమానాశ్రయంలో దుకాణం ఏర్పాటుచేసిన ఓ యూట్యూబర్.. గోల్డ్ స్మగ్లర్లకు సాయం చేస్తున్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ ఘటన చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వెలుగుచూసింది. శ్రీలంకకు చెందిన బంగారం స్మగ్లింగ్ ముఠా కోసం ఈ దుకాణం నడుపుతున్నట్టు వెల్లడయ్యింది. యూట్యూబర్ మహ్మద్ సబీర్ అలీ.. ఎయిర్‌హబ్ రిటైల్ పేరుతో ఓ షాపును అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. సబీర్ అలీకి అబుదాబిలో నివసిస్తున్న సిండికేట్ సభ్యుడు ఆర్థిక వనరులు సమకూర్చినట్టు తేలింది. లీజు కోసం రూ. 70 లక్షలు ఇచ్చినట్టు కస్టమ్స్ విభాగం వర్గాలు పేర్కొన్నాయి.


ఎయిర్‌పోర్ట్ డిపార్చర్ లాంజ్ సమీపంలో షాపు ఏర్పాటుచేసిన సబీర్ అలీ... రెండు నెలల్లో రూ. 167 కోట్ల విలువచేసే 267 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడంలో సహకరించినట్టు గుర్తించారు. నిందితుడు చెన్నై విమానాశ్రయంలో విద్వేదా పీఆర్జీ నుంచి షాపును లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. స్మగ్లింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఎయిర్‌హబ్‌తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు విద్వేదా వర్గాలు వెల్లడించాయి.


సబీర్ అలీ, దుకాణంలో పనిచేసి ఏడుగురు ఉద్యోగులకు బంగారాన్ని అక్రమంగా తరలించడానికి స్మగ్లింగ్ ముఠా శిక్షణ ఇచ్చింది. అధికారికంగా బొమ్మలు, సావనీర్‌లు, బ్యాగులు విక్రయించే ఈ దుకాణంలో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు వెల్లడయ్యింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. చెన్నైలో నివాసం ఉండే సబీర్ అలీ.. శ్రీలంక స్మగ్లింగ్ ముఠాను తన యూట్యూబ్‌ ఛానల్ (షాపింగ్‌బాయ్స్) ద్వారా సంప్రదించాడు. వాళ్లు ఇచ్చిన ఐడియాతోనే ఎయిర్‌పోర్ట్‌లో షాపును అద్దెకు తీసుకున్నాడు. దుకాణం నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినా అబుదాబీలో ఉండే స్మగ్లింగ్ ముఠా సభ్యుడు ఆర్ధిక సాయం చేసినట్టు తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షాపును తెరిచిన సబీర్ అలీ.. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ద్వారా సేల్స్‌మెన్లను రిక్రూట్ చేసుకున్నాడు. గత రెండు నెలల్లోనే కమిషన్ కింద దాదాపు రూ.3 కోట్ల సంపాదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.


ఎయిర్‌హబ్‌లోని ఎనిమిది మంది ఉద్యోగులు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసీఏఎస్) గుర్తింపు కార్డులను ఎలా పొందారనేది కూడా కస్టమ్స్ విభాగం విచారిస్తోంది. వారు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులేనని, ఇది విమానాశ్రయ నిబంధనలను ఉల్లంఘించడమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Latest News
Bihar: Youth lynched in Patna outskirts Mon, Oct 14, 2024, 05:04 PM
BJP seeks Karnataka Guv's intervention to revoke cabinet decision on withdrawal of Hubballi riot cases Mon, Oct 14, 2024, 04:51 PM
Sensex jumps up 591 points, realty and banking stocks shine Mon, Oct 14, 2024, 04:49 PM
Karnataka BJP stages protest against withdrawal of Hubballi riot case Mon, Oct 14, 2024, 04:47 PM
'Help people': DMK directs cadre after IMD predicts heavy rains in TN Mon, Oct 14, 2024, 04:44 PM