by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:16 PM
ధర్మవరంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవపురంలో ఓ మహిళ మద్యం అమ్ముతూ మంగళవారం పోలీసులకు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీ చెన్నకేశవపురానికి చెందిన లింగమ్మ అనే మహి మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అక్కడ నిఘా ఉంచామన్నారు. ఇంటిలో ఉన్న మద్యాన్ని విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Latest News