సచివాలయం గోడకి ఉన్న శిలాఫలకాలు ధ్వంసం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:26 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక పంచాయతీ కార్యాలయంపైన ఉన్న సచివాలయం గోడకు అమర్చిన నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివరాలు అప్పటి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతోసహా ఈ శిలాఫలకంపై ఉన్నాయి. గ్రామ శివారున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్‌ ఫొటోతో ఉన్న స్వాగత బోర్డులను ఊడబెరికారు. ఈ ఘటనల్ని సర్పంచ్‌ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ మద్దింశెట్టి దొరబాబు, నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్‌ సీఐ శ్రీధర్, అంగర ఎస్‌ఐ అందే పరదేశి పరిశీలించి వివరాలు సేకరించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సచివాలయం ప్రభుత్వ ఆస్తి అని, దీన్ని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడినవారిని పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Latest News
1st Test: Important to take care of position to play shots in this part of the world, says Rachin Ravindra Sun, Oct 20, 2024, 03:23 PM
Afghanistan gets access to 900 MW electricity: Energy Minister Sun, Oct 20, 2024, 03:11 PM
North Korea sends about 20 trash balloons toward South Korea Sun, Oct 20, 2024, 03:09 PM
TN forest department intensifies search for killer leopard Sun, Oct 20, 2024, 02:37 PM
Trinamool leader's statement on protesting doctors creates uproar Sun, Oct 20, 2024, 01:46 PM