by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:38 PM
అగ్నిమాపక సిబ్బంది కోసం నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. సోమవారం పాల కొండలోని వీరఘట్టం రోడ్డులో గల శిథిలావస్థకు చేరుకున్న అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పూర్తిగా శిథిలమైన భవనంలో ఉండలేక రేకుల షెడ్లో తలదా చుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లా కొండలరావు, గండి రామినాయుడు, గంటా సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Latest News