by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:16 PM
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థుల్లో సామర్థ్యాలను మెరుగుపరచాలని కర్నూలు జిల్లా, డీఈవో జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. గడిగరేవుల, గడివేముల హైస్కూళ్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజ పథకాలను పరిశీలిం చారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరిశీలించారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి కావాల్సిన సూచనలు ఇచ్చారు. గడిగరేవుల హైస్కూల్‌లోకి కేసీ కెనాల్ నీరు చేరి పాఠశాల ప్రాంగణం మునిగిపోయిన తీరును హెచ్‌హెంను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. జిల్లా ఉర్దూ డీఐ అస్ముద్దిన్, ఎంఈవో విమలావసుంధరాదేవి, హెచ్‌ఎంలు రాజేంద్రప్రసాద్, విక్టర్ ఇమ్మానుయేలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Latest News