by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:35 PM
తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు. మరో క్రస్ట్‌గేటు కొట్టుకుపోదని గ్యారెంటీ ఇవ్వలేం. అత్యాధునిక డిజైన్‌తో 33 క్రస్ట్‌గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే పరిష్కారం’’ అని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 33 గేట్లు ఏకకాలంలో మార్చడంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు(టీబీపీ బోర్డు) దృష్టి పెట్టింది. ఇలా ఒకేసారి 33 గేట్లు మార్చడం సాధ్యమేనా? ఎంత నిధులు కావాలి? అనే అంశంపై ఆరా తీసింది. దీనికి సంబంధించి డిసెంబరులోగా క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించి, పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు చైర్మన్ పాండే అధ్యక్షతన టీబీపీ బోర్డు పేర్కొంది. శుక్రవారం హోస్పెట్‌లో బోర్డు భేటీ జరిగింది.
బోర్డు సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్ర సభ్యుడు కులకర్ణి, బోర్డు ఎస్ఈ నీలకంఠారెడ్డి, ఏపీ రాష్ట్ర సభ్యుడి తరఫున అనంతపురం జిల్లా హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ నాగరాజు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రిచామిశ్ర, తెలంగాణ సభ్యుడు, ఈఎన్సీ అనీల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జలాశయంలో పూడిక చేరడంతో 30 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఆ నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రభుత్వం 31 టీఎంసీలతో నవలీ జలాశయం నిర్మాణానికి ప్రతిపా దిస్తోంది. దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని బోర్డు సమావేశంలో తెలిపింది. డీపీఆర్‌ను అధ్యయనం చేయాల్సి ఉండడంతో నవలీ రిజర్వాయర్‌కు ఏపీ అభ్యంతరం చెప్పింది. రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలు వినియోగించుకునేలా తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా మరో కాలువ నిర్మించే తేల్చాలని పేర్కొంది. కాగా, తెలంగాణ ఈ రెండింటినీ వ్యతిరేకించినట్లు సమాచారం.
Latest News