by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:07 PM
గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ఏపీ బ్రాండ్ ను దెబ్బ తీశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
గత సీఎం వైఎస్ జగన్ చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయని ఆయన విమర్శించారు. అయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు.