by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:17 PM
ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియను, నగర పరిధిలో గల అన్ని పోలింగ్ కేంద్రాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 18 ఏళ్లునిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు.