by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:26 AM
అఖిల భారత కార్మిక, రైతు సంఘాల పిలుపులో భాగంగా ఈనెల 26న రాజ్యాంగ పరిరక్షణ దినం పేరుతో గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ నుండి మార్కెట్ వరకు కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ,
బహిరంగ సభ జరుగుతుందని దీనిని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మస్తాన్ దర్గా సెంటర్ లోని టింబర్ ముఠా కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.