by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:46 AM
ప్రతీ శని, ఆదివారాల్లో గిరిజన పాఠశాలలను సందర్శిస్తానని కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో పెమ్మసాని పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకు సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా సమావేశం జరిగిందని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.