by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:10 PM
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ఈ తెల్లవారుజామున జరిగిన దాడిలో సాయుధుడు మరణించగా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. రబియా ప్రాంతంలోని గస్తీపై తొలుత ఓ సాయుధుడు కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టి కాల్చి చంపాయి. దుండగుడి కాల్పుల్లో గాయపడిన ముగ్గురు పోలీసులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ఎంబీసీ ఉన్న ప్రాంతాన్ని జోర్డాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజాపై యుద్ధాన్ని నిరసిస్తూ ఇటీవలి కాలంలో జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. జోర్డాన్‌లో దాదాపు 1.2 కోట్ల మంది పౌరులు పాలస్తీనా మూలాలున్నవారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు.
Latest News