by Suryaa Desk | Sun, Nov 24, 2024, 06:17 PM
విశాఖ ఉక్కు కోసం ఉద్యోగులు కదం తొక్కారు. గాజువాకలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నవంబర్ 26న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేబర్ కోడ్‌లు రద్దు, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లపై పోరాటం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్‌లో విలీనం చేస్తే సొంత గనులు వస్తాయని, కార్మికులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం కక్షపూరిత, మొండి వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు వీఆర్‌ఎస్ వద్దన్న ఆయన.. కార్మికులకు ఉద్యోగాల్లో కొనసాగించి ఉత్పత్తి చేయించడంద్వారా ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని నర్సింగరావు కోరారు.
Latest News