by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:37 AM
వచ్చే ఏడాది కాపు వనభోజన మహోత్సవ కార్యక్రమా నికి ముందే కాపు సంక్షేమ భవనం నిర్మించి ప్రా రంభిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి మండల పరిధిలోని నందనమారెళ్ళ గ్రా మ బాలార్కకోటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమా సం పురస్కరించుకుని కాపు వన భోజన మహో త్సవం ప్రముఖ వైద్యులు, నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఆర్.రామయ్యనా యుడు ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా జరిగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన వాగ్ధానం మేరకు కనిగిరి పట్టణానికి సమీపంలోనే అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కాపు సంక్షేమ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే కార్తీకమాసం వనబోజనాల సమయానికి ప్రారంభోత్సవం చేసుకుందామని హామీ ఇచ్చారు. కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామయ్యనా యుడు మాట్లాడుతూ కాపుల సమస్యల పరిష్కా రం కోసం అందరూ ఐకమత్యంగా ముందుండి సమస్యలను పరిష్కరించుకో వాలని పిలుపుని చ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఉగ్రనరిసింహారెడ్డిని, మున్సిపల్ చైర్మన్ గఫార్‌ను ఘనంగా సన్మా నించారు.
Latest News