by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:41 AM
పేదప్రజల వైద్య చికిత్సలకు సీఎం చంద్ర బాబునాయుడు ఔదార్యంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. ఆదివారం మద నపల్లె మండలం, పట్టణంలోని 11 మందికి ఎమ్మెల్యే సీఎం రీలిఫ్ఫండ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా రోగ్యంతో బాధపడుతున్న కొందరు ఆర్థిక సహాయం కోసం తన వద్దకు రాగా వారి వివరాలను సీఎంఆర్ఎఫ్కు పంపామన్నారు. అక్కడి నుంచి 11 మందికి రూ.లక్ష చొప్పున రూ.11 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయన్నారు. వాటిని ఆయా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు కత్తి లక్ష్మన్న, సొక్కం వేణు, కౌన్సిలర్ నాగార్జునబాబు, మున్నానాయక్, ఫంషీర్, జేసీబీ వేణు పాల్గొన్నారు.
Latest News